మా ఎన్నికలు : ఓటుకు పదివేలు ఇస్తున్నారని పెద్ద బాంబ్ పేల్చిన నాగబాబు

మెగా బ్రదర్ నాగ బాబు మరోసారి మా ఎన్నికల ఫై స్పందించడమే కాదు ఓటుకు పదివేలు ఇస్తున్నారని చెప్పి పెద్ద బాంబు పేల్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మా వేడి మరింత వేడిక్కిన సంగతి తెలిసిందే. దీనికి కారణం మంచు విష్ణు బరిలో దిగడం..ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ మద్దతు ఇవ్వడమే. ఎలాగైనా కొడుకును గెలిపించి తీరాలని సీనియర్ నటి నటులకు ఫోన్లు చేసి మద్దతు కోరుతున్నారు మోహన్ బాబు. అలాగే విష్ణు సైతం తన ప్లాన్ లో తాను ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే కొంతమంది సీనియర్ నటులు విష్ణు కు మద్దతు ఇస్తున్నట్లు తెలుపడం జరిగింది.

ఇక ఈ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నారని ముందు నుండి ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో నాగబాబు ..మంచు ప్యానల్ ఫై మండిపడ్డారు. మన వాళ్లు అన్ని ఇండస్ట్రీల్లో పని చేస్తున్నారు. కోట శ్రీనివాస రావు గారు తమిళం, కన్నడ, హిందీల్లో సినిమాలు చేయలేదా? మన వాళ్లు ఇప్పుడు ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఇండియన్ నటుడు. అన్ని భాషల్లో చిత్రాలు చేశాడంటూ ప్రకాష్ రాజ్ గురించి నాగబాబు చెప్పుకొచ్చాడు. తన సినిమాలు మానేసి అయినా కూడా ‘మా’కు టైం ఇస్తానని మాటిచ్చాడని నాగబాబు తెలిపాడు. మా సభ్యులకు మొదటిసారిగా డబ్బులు పంచతున్నారట. నాకు తెలిసింది. పది వేల చొప్పున ఇస్తున్నారని తెలిసింది. ఇంకా ఇస్తారట అంటూ నాగబాబు సంచలన కామెంట్స్ చేశాడు. మరి ఓటుకు పదివేలు ఇస్తుంది విష్ణు ప్యానల్ వారేనా..? ఇప్పుడు నాగబాబు కామెంట్స్ తో అంత దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

Vote ki 10,000/-🧐🧐@NagaBabuOffl@prakashraaj #MaaElections2021 pic.twitter.com/0v4ZA9E7AL— Ahiteja Bellamkonda (@ahiteja) October 6, 2021