తనకు చైతుకు మధ్య బాండింగ్ లేదు..ఒకే రూమ్ లో ఉంటె ఇక అంతే – సమంత

విడాకుల తర్వాత ఫస్ట్ టైం సమంత నోటి వెంట నాగ చైతన్య పేరు వచ్చింది. అలాగే విడాకుల తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుంది..ప్రస్తుతం ఎలా ఉంది…అనే విషయాలను కాఫీ విత్ కరణ్ షో లో వెల్లడించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య – సమంత లు కొంతకాలం పాటు కాపురం చేసుకున్నారు. వీరి జంట చూసి చాలామంది ఈర్ష పడ్డారు. అలాంటిది సడెన్ గా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ముఖ్యముగా అభిమానులైతే వీరి విడాకులు తట్టుకోలేకపోయారు. ఇద్దరు కూడా సోషల్ మీడియా ద్వారా ఇష్టపూర్తిగా విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సమంత కొన్ని నెలల పాటు సినిమాలకు దూరమైంది. చైతు మాత్రం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు. విడిపోయిన తర్వాత ఎవరు కూడా స్పందించలేదు.

తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ షో దీనిపై నోరువిప్పింది. ఈ షోలో నాగచైతన్యతో విడాకులపై కరణ్ జోహర్ ప్రశ్నించారు. డివోర్స్ తీసుకున్న సమయంలో చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో జీవితం చాలా కఠినంగా అనిపించిందని సామ్ పేర్కొంది. భర్తతో విడిపోయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడ్డావని కరణ్ ప్రశ్నించన సమయంలో..సమంత ఒక్కసారిగా ఫైర్ అయింది. అతను నా భర్త కాదు మాజీ భర్త అనాలని కరణ్ కు గట్టిగా చెప్పింది. దీనికి కరణ్ సారీ చెప్పడంతో సమంత కూల్ అయ్యింది. చైతుతో విడిపోయినప్పుడు మనోవేదనకు గురయ్యానని , ఆ బాధ నుంచి బయపడిన తర్వాత మరింత స్ట్రాంగ్ గా అయ్యానని చెప్పింది. తనకు చైతుకు మధ్య బాండింగ్ లేదని వెల్లడించింది. ఒకే రూమ్ లో ఉంచితే కూడా..ఇద్దరి మధ్య వివాదాలే నెలకొంటాయంది. ఫ్యూచర్ లో ఇరువురి మధ్య సఖ్యత పుడుతుందేమో చూడాలని అని తెలిపింది.

మేమిద్దరం విడిపోయినప్పుడు నాపై నెగెటివ్‌ ప్రచారం జరిగింది. నేను వాటిపై ఫిర్యాదు చేయలేకపోయాను. నేను పారదర్శకంగా ఉండాలని అనుకున్నాను. సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి నేను పెద్దగా బాధ పడలేదు. ట్రోల్ చేసే వారు నా జీవితంపై పెట్టుబడి పెట్టారు. అప్పుడు వాటికి స్పందించేందుకు నా దగ్గర సమాధానాలు లేవు. నేను ఓపెన్‌గా ఉండాలనుకున్నా. అందుకే విడిపోయిన విషయాన్ని అందరితో చెప్పా. మేము విడిపోయిన కొన్నిరోజులకే ‘ఊ అంటావా’ సాంగ్‌ ఆఫర్‌ నాకు వచ్చింది. ఆ పాట నాకెంతో నచ్చింది. అందుకే అందులో యాక్ట్‌ చేశా అని తెలిపింది.

ఇక తాను భరణం కింద రూ.250 కోట్లు తీసుకున్నానని జరిగిన ప్రచారంపై సమంత స్పందించింది. “సోషల్‌మీడియాలో నాపై ఎన్నో పుకార్లు, ప్రచారాలు జరిగాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న సమయంలో భరణం కింద రూ.250 కోట్లు నేను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని చూసి మొదట షాక్‌ అయ్యాను. ఆ వార్తలు చూసి ఎవరైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు మా ఇంటికి వచ్చి, దాడులు చేసి.. అవన్నీ అవాస్తవాలని చెబితే బాగుండు అని ప్రతి రోజూ ఎదురుచూసేదాన్ని” అని ఆమె వివరించారు. అంతేకాకుండా భవిష్యత్తులో తాను ప్రేమలో పడే అవకాశం లేదని తేల్చి చెప్పింది.