వరదబాధితులకు షర్మిల రూ. 5 వేల సాయం

వరద బాధిత కుటుంబాలకు వైఎస్‌ షర్మిల రూ.5వేల తక్షణ సాయం అందజేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాలలో పర్యటించిన షర్మిల ఎప్పటిలాగానే కేసీఆర్‌ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు వస్తాయని తెలిసినా, ముంపు ప్రాంతాలపై ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ చెప్పిన రూ.10వేలు వస్తాయో లేదో తెలియదు. ప్రస్తుతం మంచిర్యాల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరుపున పట్టణంలోని NTR నగర్ లో వరదలకు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.5వేలు తక్షణ సాయం అందిస్తామని ప్రకటన చేశారు. 2002 నుంచి ఈ పోడు భూములను సాగు చేసుకుంటున్నారని… ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వక పోవడం దారుణమని ఆగ్రహించారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని… వైఎస్సార్ మీ పట్టాలను మీ చేతుల్లో పెట్టే వారన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో అన్ని ప్రాజెక్ట్ లు , చెరువులు నిండిపోయాయి. ఇక గోదావరి ఉదృతి గురించి ఎంత చెప్పిన తక్కువే. భద్రాచలం వద్ద ఏకంగా 70 అడుగులే మేర గోదావరి ప్రవహించడం తో పట్టణంలోని పలు కాలనీ లు , ముంపు గ్రామాలు నీట మునిగాయి. దాదాపు ఐదు రోజుల పాటు ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండిపోయారు. ప్రస్తుతం గోదావరి శాంతించడం తో వరద ఉదృతి తగ్గుముఖం పట్టింది. కాకపోతే ఈరోజు , రేపు తెలంగాణాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది.