సమంత చూపించాల్సింది చూపించి పుకార్లకు చెక్ పెట్టింది

వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమంత ను ‘మయోసైటిస్’ వ్యాధి బ్రేక్ పడేలా చేసింది. చాల అరుదుగా అతి కొద్దీ మందికి సోకే ఈ వ్యాధి సమంతకు సోకింది. దీంతో గత కొద్దీ నెలలుగా చికిత్స తీసుకుంటూ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె నటించిన శాకుంతలం మూవీ ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన సమంత ను చూసి చాలామంది రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఫేస్‌లో మునుపటి గ్లో కోల్పోయిందని, చాల వీక్‌గా కనిపిస్తుందని ఇలా అనేక రకాలుగా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు. ఈ క్రమంలో సమంత వారికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. తను జిమ్‌లో వర్క్‌ అవుట్ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది. తను అద్దం ముందు నిలబడి కండలు ప్రదర్శిస్తుండగా.. ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్ జునైద్ ఈ పిక్ తీసినట్లు తెలుస్తోంది. ఇందులో పింక్, బ్రౌన్ టాప్ ధరించి ఉన్న సామ్ తన మజిల్స్ చూపిస్తూ.. ‘అంత డెలికే‌ట్‌గా ఏం లేదు’ అని క్యాప్షన్ జోడించింది. ఈ పిక్ తో పుకార్లకు చెక్ పడేలా చేసింది.