రూ.100 కోట్ల వైపు పరుగులు తీస్తున్న విరూపాక్ష

సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు రూపొందించిన హర్రర్ మూవీ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించగా , శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

వారం లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.66 కోట్లు షేర్‌, రూ. 57.20 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ..ఇప్పుడు రూ. 100 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. 13 రోజుల్లో 82.3 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వీకెండ్ కి 85 కోట్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 100 కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. బలమైన కథాకథనాలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ … ఫొటోగ్రఫీ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి.