థాంక్స్ అన్న అంటూ మహేష్ కు కృతజ్ఞతలు తెలిపిన సల్మాన్ దుల్కర్

మహానటి ఫేమ్ సల్మాన్ దుల్కర్..సూపర్ స్టార్ మహేష్ బాబు థాంక్స్ అన్న అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఓకే బంగారం సినిమాతో తెలుగు లో ప్రేక్షకులకు పరిచయమైనా సల్మాన్.. మహానటి మూవీ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మహానటి లో జెమిని గణేష్ పాత్రలో అద్భుతంగా నటించి తనకంటూ గుర్తింపు సాదించుకున్నాడు. ఇక రీసెంట్ గా సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువయ్యాడు. హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కింగ్ ఆఫ్ కోట అనే టైటిల్ తో సల్మాన్ సినిమా రాబోతుంది. ఈ మూవీ పాన్ ఇండియాగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ క్రమంలోనే కింగ్ ఆఫ్ కోట టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో ఈ మూవీ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. మలయాళం లో దుల్కర్ తండ్రి మమ్ముట్టి రిలీజ్ చేయగా తెలుగులో మహేష్ రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ చేసి చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. సల్మాన్ మరోసారి ఆకట్టుకునే సినిమా చేస్తున్నాడు అని తెలిపారు మహేష్. దీని పై సల్మాన్ స్పందిస్తూ మహేష్ కు థాంక్స్ చెప్పాడు. థాంక్యూ సో మచ్ అన్న అంటూ మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలుపడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.