వలకు చిక్కిన దెయ్యం చేప..భయంతో వదిలేసాడు

చేప ఎలా ఉంటుందో తెలియంది కాదు..చెరువులలో , నదులలో ఓ మాదిరిగా..అదే సముద్రంలో కాస్త పెద్దవిగా ఉంటాయి. మనకు తెలియని ఎన్నో జాతుల చేపలు ఉన్నాయి. అయితే దెయ్యం చేప మాత్రం చాల అరుదుగా కనిపిస్తుంటాయి. వీటి పేరే కాదు వీటి రూపం కూడా భయంగానే ఉంటుంది. అలాంటి భయంకర చేప ఓ జాలరుకి చిక్కింది.

తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి దగ్గర మడేరు వాగులో ఓ గిరిజనుడు చేపలు పడుతున్నాడు. కిలో బరువు వుండే చేప వలకు చిక్కింది. దానిని బయటకు తీయగా చాల వింతగా ..భయంకరంగా కనిపించడంతో వెంటనే దానిని నీటిలో వదిలేసాడు. ఈ చేపను సక్కర్‌ మౌత్‌ క్యాట్‌ ఫిష్‌ అంటారని.. ఇది విషపూరితమైందని నిపుణులు చెప్పుకొచ్చారు. దీనిని దెయ్యం చేప అని కూడా అంటారట. ఈ చేప చుట్టూ ఉండే మిగిలిన చేపలను గాయపరచి, చంపి తింటుందట.