చంద్రబాబును జనాలు ఎప్పుడో మర్చిపోయారు

బాబు జూమ్ నాయకుడు అయ్యారు

Lakshmi Parvathi
Lakshmi Parvathi

అమరావతి : వైస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి టీడీపీ అధినేత పేయ్ మండిపడ్డారు .ఏపీ కు చంద్రబాబు సేవలు అవసరం లేదని ఆమె అన్నారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని చెప్పారు. దుర్బుద్ధి వల్లే చంద్రబాబు అడ్రస్ లేకుండా పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు… ప్రతి అంశాన్ని రాజకీయాలకు అనుగుణంగా మలుచుకునేందుకు యత్నిస్తారని విమర్శించారు. డాక్టర్ సుధాకర్, రంగనాయకమ్మ కూడా చంద్రబాబు రాజకీయాలకు బలవుతున్నారని చెప్పారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నీచ రాజకీయాలే చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. బాబు జూమ్ ద్వారా మీటింగులు పెట్టుకుంటూ జూమ్ నాయకుడిగా ఎదిగిపోయారని అన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/