సౌకర్యాలపై ఆరా తీసిన ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్

మిర్యాల‌గూడ బ‌స్టాండ్‌లో ప్ర‌యాణికుల‌తో మాట్లాడిన స‌జ్జ‌నార్

హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆర్టీసీలోని ప‌రిస్థితుల‌ను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు నిన్న ఆయ‌న‌ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ రోజు మిర్యాల‌గూడ బ‌స్టాండ్‌లో త‌నిఖీలు చేశారు. బస్టాండ్‌లలో అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయా? అన్న విష‌యాల‌ను ప్ర‌యాణికుల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మిర్యాల‌గూడ‌లో అధికారులతోనూ స‌జ్జ‌నార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని మీడియాకు చెప్పారు. రెండేళ్లుగా 30 శాతం డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడింద‌ని తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/