టీడీపీ మేనిఫెస్టో ఫై సజ్జల విమర్శలు

2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు మినీ మేనిఫెస్టోను ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రాజమండ్రి వేదికగా జరిగిన టీడీపీ మహానాడు సభలో ప్రకటించారు. ఈ మేనిఫెస్టో ఫై వైస్సార్సీపీ నేతలు స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైస్సార్సీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలు దరిద్రంగా ఉన్నాయని విమర్శించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కూడా కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టారని ఆరోపించారు.

అరాచకం, అవినీతిలో చంద్రబాబు కొత్త రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. “చంద్రబాబు గతంలో ఏంచేశాడో చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు… మేం ఇది చేశాం అని మేం చెప్పుకోగలం. కానీ చంద్రబాబు ఏం చెప్పుకోగలరు? అబద్ధాల్లో చంద్రబాబుకు గిన్నిస్ రికార్డు ఇవ్వొచ్చు” అని సజ్జల వ్యంగ్యం ప్రదర్శించారు.

14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు ప్రజలకు చేసిందేమిటి అని ప్రశ్నించారు. మేం ఇది చేశాం అని తాము ప్రజలను ఓట్లు అడగ్గలమని, చంద్రబాబు ఏంచేయలేదు కాబట్టి ఆయనకు ఆ అవకాశం లేదని విమర్శించారు.

ఇక టీడీపీ మినీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు చూస్తే..

1) పేదలను ధనవంతులు చేయడం

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలను సంపన్నులను చేస్తుంది.

ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది

2) బీసీలకు రక్షణ చట్టం

బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తాం.. ఈ చట్టం అన్ని విధాలా అండగా నిలుస్తుంది.

3) ఇంటింటికీ నీరు

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే “ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ 4) అన్నదాత

అన్నదాత పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం

5) మహాశక్తి

ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ

‘తల్లికి వందనం’ పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు అందజేత

“దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం

“ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం

6) యువగళం

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన

ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు 2500 రూపాయలు అందజేత