సజ్జల రామకృష్ణారెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు

వెలిగొండ ప్రాజెక్టు 1989లోనే ఎన్టీఆర్‌ శ్రీకారం చుట్టారు

devineni uma
devineni uma

విజయవాడ: వెలిగొండ టన్నెల్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. వెలిగొండ ప్రాజెక్టుకు 1989లోనే ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి అవినీతి, కమీషన్ల కక్కుర్తి వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టన్నెల్ చరిత్రను బయటపెట్టామని చెప్పారు. గత ఏజెన్సీ 3.8 కిలోమీటర్లు మాత్రమే పనిచేసిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.400 కోట్లకు పెంచామని దేవినేని చెప్పారు. దీనిపై రివర్స్ టెండరింగ్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రభుత్వాన్ని దేవినేని ప్రశ్నించారు. దివాళా తీసే పరిస్థితిలో ఉన్న కంపెనీలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారని అన్నారు.
వైఎస్‌ఆర్‌సిపి నేతలు దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/