చంద్రబాబుపై సజ్జల విమర్శలు

చంద్రబాబు వంటి దళితద్రోహి మరొకరు లేరన్న సజ్జల

sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy

అమరావతి: ఊళ్లలో జరిగే గొడవల్ని ప్రభుత్వంపైకి నెడుతూ తాను దళితోద్ధారకుడ్నని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వంటి దళిత ద్రోహి మరొకరు లేరని మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం వద్దనలేదా? ఇళ్ల పట్టాలను కోర్టు కేసుల పేరుతో అడ్డుకోలేదా? అమరావతిలో పేదవారికి ఇళ్లు ఇవ్వనీయకుండా డెమోగ్రఫీ మారిపోతుందని తన మనుషులతో హైకోర్టులో చెప్పించలేదా? ఇవన్నీ దళిత వ్యతిరేక చర్యలు కాదా? అని సజ్జల ప్రశ్నించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎక్కడ ఏంజరిగినా వెంటనే చర్యలు తీసుకుంటోందని, పోలీసు అధికారులపైనా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి చర్యలు తీసుకున్నారా? అని నిలదీశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/