పాఠశాలలను తెరిచేందుకు సిద్ధమవుతున్న చైనా

చైనాలో క్రమంగా మాయమవుతున్న కరోనా కేసులు

china-ready-to-reopen-schools

బీజింగ్‌: చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మూతబడిన పాఠశాలలను పూర్తిస్థాయిలో తెరిచేందుకు చైనా సిద్ధమవుతోంది. చైనాలో ప్రస్తుతం 288 మంది కరోనా రోగులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరో 361 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక, నిన్న దేశంలో కొత్తగా 9 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. అయితే, వీరంతా బయటి దేశాల నుంచి వచ్చిన వారేనని, స్థానికులు ఎవరూ లేరని ప్రభుత్వం పేర్కొంది.

కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో ఇటీవల ప్రభుత్వం బడులు తెరిచింది. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి కొవిడ్ నిబంధనలతో తరగతులు నిర్వహిస్తోంది. అయితే, ఇంకా 25 శాతం మంది స్కూళ్లకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి పూర్తిస్థాయిలో పాఠశాలలు తెరవాలని నిర్ణయించింది. మరోవైపు, రాజధాని బీజింగ్‌లో అన్ని విద్యా సంస్థలకు చెందిన 6 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/