చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి : సజ్జల

ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడైనా రావొచ్చు… సచివాలయంలో మంత్రుల కమిటీ సిద్ధంగా ఉంది: సజ్జల

అమరావతి : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోమారు ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రారమ్మని పిలిచారు. ఉద్యోగ సంఘాల నేతలు ఈ క్షణమైనా రావొచ్చని, చర్చలు జరిపేందుకు సచివాలయంలో మంత్రుల కమిటీ సిద్ధంగా ఉందని సజ్జల స్పష్టం చేశారు.

ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందుకు, ఓ మెట్టు దిగేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరకదని సజ్జల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు సచివాలయంలో మంత్రుల కమిటీ రేపు కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. కాగా, ట్రెజరీ ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం క్రమశిక్షణ రాహిత్యమని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/