సౌరవ్‌ గంగూలీ బయోపిక్‌ రానుందా?

Sourav Ganguly
Sourav Ganguly

ముంబయి: ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. అయితే ఈ లిస్టులోకి తాజాగా మరో చిత్రం వచ్చి చేరనుంది. ఎవరిది ఆ బయోపిక్‌ అనుకుంటున్నారా? అతడే భారత మాజీ కెప్టెన్‌, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ. అవును మీరు వింటున్నది నిజమే. గతంలో ఎమ్ ఎస్ ధోనీ, సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ కూడా విడుదలై హిట్టు కొట్టగా.. 1983 వరల్డ్ కప్ గెలిచిన కపిల్ దేవ్ జట్టుపై రణ్ వీర్ సింగ్ ప్రాధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ జాబితాలో బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరు చేరనుంది. దాదా జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్మకుడు కరణ్ జోహార్ సినిమా తీసే పనిలో ఉన్నారట. ఇందుకోసం కరణ్ తరచూ గంగూలీని కలుస్తున్నాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

తన బయోపిక్ తీస్తామని చాలా తనను కలిశారని దాదా గతంలో పలుసార్లు ప్రకటించాడు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. వెండితెరపై తన పాత్రను హృతిక్ రోషన్ పోషిస్తే బాగుంటుందని కూడా గంగూలీ ఓ సందర్భంలో చెప్పాడు. అయితే, దాదా బయోపిక్ ను తీసే బాధ్యత కరణ్ జోహార్ తీసుకున్నాడని తాజా సమాచారం. దీనికోసం ఇద్దరు ఇప్పటికే రెండు మూడు సార్లు సమావేశం అయ్యారని, ప్రస్తుతం దాదా పాత్రలో నటించే హీరో కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/