నేటి నుంచే రైతు బంధు సాయం..కేటీఆర్​

రైతుల ఖాతాల్లో రూ.7,508 కోట్లు

హైదరాబాద్: రైతు బంధు కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ సందర్భంగా 63.25 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని ఆయన చెప్పారు. రైతుల ఖాతాల్లో రూ.7,508 కోట్లను జమ చేస్తామని పేర్కొన్నారు. రైతుల పెట్టుబడి సాయం కోసం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతు బంధు పథకం దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమమని, ఆ తర్వాత మరిన్ని రాష్ట్రాలూ తెలంగాణను అనుసరిస్తున్నాయని ఆయన అన్నారు.

ఇప్పుడు మహమ్మారి సమయంలోనూ ఆ పథకం నిరాటంకంగా కొనసాగుతోందని కొనియాడారు. 150.18 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతుబంధు సాయాన్ని అందిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఇది రైతు ప్రభుత్వమని, రైతుల రాష్ట్రమని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/