జాతీయవాదం అనే పదం వాడొద్దు..

అది హిట్లర్‌ నాజీయిజాన్ని గుర్తు చేస్తుంది

mohan bhagwat
mohan bhagwat

జార్ఖండ్‌: జాతీయవాదం అన్న పదాన్ని ప్రజలు వాడొద్దని దేశం అనే పదాన్ని వాడాలని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పిలుపునిచ్చారు. రాంచీలోని ముఖర్జీ యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం రష్యాలో ఓ సంఘ కార్యకర్తతో జరిగిన సంభాషణను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జాతీయవాదం అన్న పదాన్ని వాడటం వలన అది హిట్లర్‌ నాజీయిజాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. ఛాందసం కారణంగా దేశంలో అశాంతి నెలకొందని, దేశంలో భిన్నత్వం ఉన్నప్పటికీ, దేశంలో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. అందరినీ కలుపుకుపోయే తత్వం భారత్‌ విధానంలోనే ఉందని అన్నారు. భారత దేశ సంస్కృతి హిందూ సంస్కృతి అని, భిన్నత్వం ఉన్నా సరే, అందరూ కలిసి మెలిసి ఉంటారని పేర్కొన్నారు. భారతదేశం పునర్వైభవ స్థితికి చేరుకునేంత వరకు సంఘ్‌ పనిచేస్తూనే ఉంటుందని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/