ఐఎంఎఫ్‌ సలహాదారుగా రాజన్‌!

ఐఎంఎఫ్‌ ఎండి క్రిస్టలినా జార్జివా వెల్లడి

raghuram rahan
raghuram rajan

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎక్స్‌టర్నల్‌ అడ్వయిజరీ గ్రూప్‌లోకి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ను ఆహ్వనించినట్లు ఐఎంఎఫ్‌ ఎండి క్రిస్టలినా జార్జివా వెల్లడించారు. ఐఎంఎఫ్‌ తన సభ్యదేశాకు సరైన సమయంలో సలహాలు సూచనలు ఇవ్వాలంటే తమకు నిపుణులైన వారి నుండి సరియైన సూచనలు రావాల్సి రావాల్సి ఉంది. ఆ కారణం తోనే రఘురాం రాజన్‌ను ఆహ్వానించాం అని క్రిస్టలినా తెలిపారు. భారత రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ గా మూడేళ్లు సేవలందించి 2016 లో తన పదవికి రాజీనామా చేసిన అనంతరరం యూనివర్శిటి ఆఫ్‌ చికాగోలో ప్రోఫెసర్‌ గా రాజన్‌ కొనసాగుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/