ఫ్లాట్ ఫాంపైకి బస్సు ఘటన..మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

rs-5-lakh-ex-gratia-to-the-families-of-the-deceased-said-apsrtc

అమరావతిః విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బ్రేక్ ఫెయిల్ అయ్యి ఆర్టీసీ బస్సు ప్లాట్‌ఫారమ్ మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఔట్ సోర్సింగ్ కండక్టర్, ఒక మహిళా ప్రయాణికురాలు మృతి చెందారు. అటు పలువురికి గాయాలు అయ్యాయి. అయితే.. ఈ సంఘటనపై ఏపీ ఆర్టీసీ స్పందించింది.

బస్సు ప్రమాదం దురదృష్టకరం అని ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. కుమారి అనే ప్రయాణికురాలు, బుకింగ్ క్లర్క్, ఓ బాలుడు మృతి చెందారని వివరించారు. మానవ తప్పిదమా? సాంకేతిక తప్పిదమా అనేది తెలియాల్సి ఉందని చెప్పారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. 24 గంటల్లో విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటన చేశారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. గాయపడిన వారికి మంచి చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.