విశాఖలో సెటిల్ అవ్వాలనేది నా చిరకాల కోరిక: చిరంజీవి

ఘనంగా ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Waltair Veerayya prerelease event Pic

వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని ఇక్కడకు ఎపుడు వచ్చినా ఉద్వేగానికి లోనవుతానని విశాఖలో స్థిరపడాలనేది తన చిరకాల కోరిక అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇక్కడ స్థలం కూడా కొన్నానని ఇక్కడే ఇల్లు కట్టుకుని వుండాలని అనిపిస్తుంది అన్నారు. అపుడు నేనుకూడా వైజాగ్ వాసిని అవుతానని అన్నారు.. ఇక్కడ ప్రశాంత వాతావరణం , ప్రజల మనసులో ఎటువంటి కల్మషం ఉండదని. అందరూ కలిసి మెలిసి ఉంటారని అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. ఆదివారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ముందుగా డైరెక్టర్ బాబీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అభిమాని అని కాకుండా, నిరంతరం కష్టపడే తత్వం వలన అతనికి సినిమా అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాక ఇది మామూలు కమర్షియల్ సినిమా కాదు అని, అన్ని ఉన్నాయి అని ఇదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అంటూ చెప్పుకొచ్చారు. గంట సేపు చెప్పిన కథ కంటే కూడా ప్రతి రోజూ ఆ కథను చెక్కుతూ మరింత కష్టపడి చేసిన డైరెక్టర్ బాబీ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదొక నిఖార్సయిన పక్కా కమర్షియల్ చిత్రం అని, బ్లాక్ బస్టర్ హిట్ అంటూ చెప్పుకొచ్చారు.

నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రంగస్థలం చిత్ర సమయం లో వీరి గురించి తెలుసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీ కి ఎంతో అవసరం అని అన్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రం లో పాత్ర మరో లెవెల్ లో ఉంటుంది అని అన్నారు. శృతి హాసన్, కేథరిన్ ల నటన సినిమా కి హైలెట్ అవుతుందని అన్నారు. ప్రకాష్ రాజ్, జయ సింహ ల నటన పై ప్రశంసలు కురిపించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు అని, రిలీజ్ కానీ థీమ్ సాంగ్స్ ఇందులో చాలా బాగుంటాయి అని పేర్కొన్నారు.

చిన్నతనంలోనే చిరుకు వీరాభిమానిని: రవితేజ

తాను చిన్నతనంలోనే చిరుకు వీరాభిమానిని అయ్యానని రవితేజ తెలిపారు. చిరును చూడటం మానేసి, ఒకరోజు మెగాస్టార్ పక్కన కూర్చుంటానని తన స్నేహితులకు మాట ఇవ్వడంలో జరిగిన సంఘటనను వివరించాడు. చిరు అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అని రవితేజ అన్నారు. చిరంజీవి ఎప్పుడూ ఎవరి గురించి నెగెటివ్‌గా మాట్లాడరు అని, ఏదైనా బాధ ఉంటే అది బయటికి కనపడనివ్వరు అని ఆయన అన్నారు. వాల్తేరు వీరయ్యతో బాబీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడని అన్నారు. సంక్రాంతికి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని రవితేజ అన్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/category/news/national/