కూసుమంచి వద్ద కారు బోల్తా..భారీగా నగదు బ్యాగులు

ఎన్నికల వేళ భారీగా నగదు బయటపడుతుంది. నిన్న వైజాగ్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న కార్ బోల్తా పడిన ఘటన భారీగా నగదు బయటపడిన ఘటన మరచిపోకముందే..ఈరోజు ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం కేశవాపురం వద్ద ఓ కారు బోల్తాపడింది.

దీంతో కారులో భారీగా నగదు బయటపడింది. కారులోని రెండు బ్యాగుల్లో డబ్బును స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు కోటి రూపాయలు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదుచేసి నగదు తరలింపుపై విచారణ చేస్తున్నారు.