థియేటర్స్ లలో దద్దరిల్లుతున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్…

థియేటర్స్ లలో దద్దరిల్లుతున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్…

గత కొద్దీ నెలలుగా ఎదురుచూస్తున్న అసలు సిసలైన ట్రైలర్ థియేటర్స్ లోకి వచ్చేసింది.. వచ్చేయడమే కాదు థియేటర్స్ ను దద్దరిల్లిస్తుంది. ఇంతకీ ఆ ట్రైలర్ ఏంటి అనుకుంటున్నారా..అదే ఆర్ఆర్ఆర్ ట్రైలర్. బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడం..ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో పాటు బాలీవుడ్ , హాలీవుడ్ స్టార్స్ నటించడం తో ఈ సినిమా ఫై అందరిలో ఆసక్తి నెలకొనింది. కరోనా కారణంగా రెండు సార్లు వాయిదా పడిన ఈ మూవీ…జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ చిత్ర ట్రైలర్ ను కొద్దీ సేపటి క్రితం దేశ వ్యాప్తంగా అన్ని థియేటర్స్ లలో రిలీజ్ చేసారు.

ఈ ట్రైలర్ ను చూసేందుకు అభిమానులు వందల సంఖ్యలో థియేటర్స్ కు తరలివచ్చారు. తెరపై ట్రైలర్ రాగానే ఈలలు వేస్తూ పేపర్​ కటింగ్స్​ను గాల్లోకి ఎగరేస్తూ ట్రైలర్​ను ఎంజాయ్​ చేశారు. థియేటర్ల బయట భారీ సైజ్​ కేక్​లు కట్​ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో ట్రెండ్రింగ్​ అవుతున్నాయి. ట్రైలర్ కు సంబదించిన కొన్ని సన్నివేశాల్ని తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియోస్ వైరల్ గా మారాయి. మీరు కూడా ఆ వీడియోస్ లుక్ వెయ్యండి.

#RRRMovieTrailer
Just Nailed it …. #RamCharan …. pic.twitter.com/YcdwgX1iAN— Republican_Indian 🇮🇳 (@Kautilya_Aristo) December 9, 2021

RRR Trailer#RRRTrailer #RRRMovieTrailer #RRRMovie #RRRMovieCelebrations #ManOfMassesNTR pic.twitter.com/BmOvCeVrIb— @RKR (@krishnadevaansh) December 9, 2021