సంక్రాంతి రేసులో ఆర్ఆర్ఆర్..విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లేనా..?

యావత్ సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం RRR (ఆర్ఆర్ఆర్). బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడం..ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలు గా నటిస్తుండడం..పాన్ ఇండియా మూవీ గా రాబోతుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొనిన్నాయి. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ మూవీ రిలీజ్ ఫై మొదటి నుండి అనుమానాలు కలుగుతూనే ఉన్నాయి.

కరోనా కారణంగా సినిమాను చెప్పిన తేదికి విడుదల చేయలేకపోయారు. ఆ తర్వాత ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు కానీ కుదరడం లేదు. ఈ మధ్య మార్చికి వాయిదా పడినట్లు కొద్ది రోజులు క్రితం వార్తలొచ్చాయి. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా జనవరిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారంలో కి వచ్చింది. తాజాగా అదే నెలకి ఫిక్స్ అయినట్లు యూనిట్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. జనవరి 8న చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి ఫిక్సైనట్లు టాక్. ఈ తేదీపై రాజమౌళి తుది నిర్ణయం తీసేసుకున్నారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలో అతి త్వరలోనే వెలువడనుందని సమాచారం.