రెడ్‌జోన్‌ మినహా మిగిలిన ప్రాంతాలలో టీకాలు

శిశువులు గర్భిణీలకు వెంటనే ఇవ్వాలని సూచన

vaccination
vaccination

అమరావతి: గర్బిణులు, శిశువులకు ఇచ్చే రోగనిరోధక టీకాలను వెంటనే వేయాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబందించిన చర్యలను ప్రారంభించింది. రాష్ట్రంలో ఈ టీకాలను ఆశా వర్కర్లు వేస్తారని తెలిపింది. టీకాలు వేసే సమయంలో ప్రతి ఒక్కరు ఐదు నుంచి ఏడు అడుగుల దూరం పాటించాలని. ప్రతి ముఫ్పై నిమిషాలకు కేవలం నలుగురికి మాత్రమే టీకాలు వేస్తారని చెప్పారు. టీకాలు ఇచ్చే సమయాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేస్తారని తలిపారు. రెడ్‌జోన్‌ మినహ సబ్‌ సెంటర్‌, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, ఈయూ పీహెచ్‌సీల్లో టీకాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/