మెగా హీరో బరిలో తప్పుకోబోతున్నాడట..

మెగా హీరో వరుణ్ తేజ్ క్రిస్మస్ బరి నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ‘ఎఫ్‌2’, ‘గద్దల కొండ గణేశ్‌’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌ల తర్వాత మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తోన్న చిత్రం ‘గని’. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా.. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో నదియా కనిపించనుంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాకపోతే నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాని డిసెంబర్ 24 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే అనౌన్స్ చేశారు.

దీంతో రెండు చిత్రాలకు పోటీ తప్పదని అందరూ అనుకున్నారు. అయితే ఒకే రోజు సినిమాలు రిలీజ్ చేసే విషయంలో ఇరు వర్గాలు చర్చించుకున్నారని తెలుస్తోంది. నాని ముందే డిసెంబర్ 24ను లాక్ చేసి పెట్టుకోవడం.. అందులోనూ నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్న సినిమా కావడంతో వాయిదా వేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదట. ‘గని’ కూడా అదే డేట్ కోసం పట్టుబట్టినప్పటికీ.. ఇప్పుడు వెనక్కి తగ్గడానికి కాంప్రమైజ్ అయ్యారని టాక్ నడుస్తోంది. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.