ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి ఎగ్జామ్స్‌ ప్రిపరేషన్‌

కెరీర్‌: పోటీ పరీక్షల ప్రత్యేకం

కేంద్ర ప్రభుత్వ కొలువు అది కూడా ఇండియన్‌ రైల్వేస్‌లో ఉద్యోగమంటే కోరుకోని వారుండరు. ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి (నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ) పరీక్ష (స్టేజ్‌-1) డిసెంబరు 15న జరుగనుంది.

RRB NTPC Exams Preparation
RRB NTPC Exams Preparation

దేశవ్యాప్తంగా 35వేలకుపైగా పోస్టుల భర్తీకి జరిగే ఈ పరీక్ష కోసం కోటిమందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు అంచనా.

ఇంతటి పోటీ నెలకొన్న పరీక్షలో ప్రతి మార్కు అభ్యర్థి విజయాన్ని నిర్ణయిస్తుందనడంలో సందేహం లేదు. ఈ నేపధ్యంలో ఆర్‌ఆర్‌బి ఎన్టఇపిసి పరీక్షలో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం.

ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి (నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ) లో జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, జూని యర్‌ టైమ్‌ కీపర్‌, ట్రైన్స్‌ క్లర్క్‌, కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌, ట్రాఫిక్‌ అసిస్టెంట్‌, గూడ్స్‌గార్డ్‌, సీనియర్‌ కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌, సీని యర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌, సీనియర్‌ టైమ్‌ కీపర, కమర్షియల్‌ అప్రెంటీస్‌ అండ్‌ స్టేషన్‌ మాస్టర్‌ వంటి మొత్తం 35,208 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ విడుదలైంది.

కొవిడ్‌-19 కారణంగా ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సిబిటి)గా నిర్వహించాలని నిర్ణయించారు. స్టేజ్‌-1 పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు-100 మార్కులకు జరుగుతుంది.

పరీక్ష సమయం 90 ఇమిషాలు. ఇందులో మ్యాథ్‌మెటిక్స్‌ (క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూట్‌) నుంచి 30 ప్రశ్నలు-30 మార్కులకు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ నుంచి 30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులకు అడుగుతారు.

  • స్టేజ్‌-1లో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు సాధించినవారిని మాత్రమే స్టేజ్‌-2 పరీక్షలో మ్యాథమెటిక్స్‌ 35 మార్కులు-35 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 35 ప్రశ్నలు-35 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 50 మార్కులకు. ఇలా మొత్తం 120 ప్రశ్నలు-120 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3 మార్కులు కోత వేస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/