డిజిటల్‌ మార్కెటింగ్‌లో రాణించాలంటే..

కెరీర్‌: విద్య, ఉపాధి, వికాసం

Excellence in digital marketing

లాభాలు పెంచుకోవాలి, ఖర్చు లు తగ్గించుకోవాలి, పోటీలో మందు ఉండాలి, కస్టమర్ల అభి రుచులను కనిపెట్టి వారిని కలకాలం కాపాడుకోవాలి..ఎలా? వినియోగదారుల అవసరాల మేరకు వస్తువులు మార్కెట్‌లోకి ఏ విధంగా వస్తాయి? ట్రెండ్స్‌ అందరూ ఫాలో అవుతారు.

మరి ఆ ట్రెండ్స్‌ ఎవరు సృష్టి స్తారు? ఆధునిక డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రపంచంలో ఎదురయ్యే ఈ ప్రశ్నలకు ఏకైక సమాధానం ఎనలిటిక్స్‌.అమె జాన్‌లో నిన్న అన్వేషించిన వస్తువుకు సంబంధించిన సమాచారం ఈ రోజు ఏ వెబ్‌సైట్‌ చూస్తున్నా, వాణిజ్య ప్రకటన రూపంలో దర్శనమిస్తుంది.

బెంగళూరు వెళ్లడానికి ఆన్‌లైన్‌ లో టికెట్‌ బుక్‌చేసుకున్న తర్వాత పక్కనే బెంగళూరు హోటళ్లు, ట్రావెల్‌ ఏజెన్సీల ప్రకటనలు వస్తుంటాయి. ఇవన్నీ ఎలాసాధ్యం? మన అవసరాలు, ఇష్టాలను అంత వేగంగా ఎవ రు గమనిస్తున్నారు..మనకు కావాల్సిన వాటినే ఎలా ప్రదర్శిస్తున్నారు? ఒకటే సమాధానం. అదంతా ఎనలిటిక్స్‌ మహిమ.

ఇదే ఇప్ప టి ఆధునిక వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తోంది. కొత్త కొత్త అవకాశాలకు దారి చూపుతోంది. పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి వ్యాపార, వాణి జ్య వ్యూహాలకు దిశానిర్దేశం చేస్తోంది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, రిటైల్‌, హెల్త్‌కేర్‌, ఎఫ్‌ఎంసిజి, మీడియా తదితర విభాగాల్లో ఎనలిటిక్స్‌ను విస్తృతంగా ఉపయోగి స్తున్నారు.

అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్టాటిస్టిక్స్‌, క్వాంటిటేటివ్‌ అనాలిసిస్‌, ఫ్యాక్ట్‌ బేస్డ్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలతో విశ్లేషించి, కొన్ని రకాల ఫలితాలను పొందడమే ప్రధాన లక్ష్యం. వాటి ఆధారంగా వినియోగదారుల బిహేవియర్‌, ప్యాటర్న్‌, ట్రెండ్‌ పసిగడతారు. వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు. వ్యూహాలను రచిస్తారు.

ఏ నైపుణ్యాలు కావాలి?

ఎనలిటిక్స్‌లో కెరియర్‌ ఎంచుకునే అభ్యర్థులకు క్వాంటిటేటివ్‌, అనలిటికల్‌, కమ్యూనికేషన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యా లు ఉండాలి. ప్రోగ్రామింగ్‌, స్టాటిస్టికల్‌, మ్యాథ్స్‌, మెషీన్‌ లర్నింగ్‌, డేటా విజువలైజింగ్‌ స్కిల్స్‌ పెంపొందించుకోవాలి. వినియోగదారుల అవసరాలు, ఇబ్బందులను గమనించాలి. ఏవిషయమైనా ఎందుకు, ఎలా అనే స్పష్టత ఏర్పరచుకోవాలి. పూర్తి ఆసక్తి, సమస్యను అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉండాలి. లాజిక్‌, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ నేర్చుకోవాలి. సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం ఎనలిస్ట్‌ ప్రధాన విధి. వాటిఆధారంగా నివేదికలు తయారు చేస్తారు.

కోర్సులు:

ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) కోల్‌కతా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) ఖరగ్‌పూర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), కోల్‌కతా ఈ మూడు సంస్థలూ కలిసి పిజి డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ ఎనలిటిక్స్‌కోర్సును రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. ఇందులో చేరిన అభ్యర్థులు ఒక్కో సంస్థలో 6 నెలల పాటు చదువుకుంటారు.

చివరి 6 నెలలు ఇంటర్న్‌ షిప్‌ ఉంటుంది. ఎనలిటిక్స్‌ కి సంబంధించిన సాంకేతికాం శాలు ఐఐటిలో, స్టాటిస్టిక్స్‌, మెషీన్‌ లర్నింగ్‌ థియరీని ఐఎస్‌ఐలో, అనువర్తనా లను ఐఐఎంలో నేర్పుతారు. 60 శాతం మార్కులతో బిటెక్‌/ఎంటెక్‌/ఎమ్మెస్సీ/ఎంకాం పూర్తి చేసుకున్న వారు అర్హులు. పరీక్ష లో చూపినప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పదోతరగతి, ఇంటర్మీడియట్లలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఫీజు రూ.20 లక్షలు. స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. అడ్మిషన్ల ప్రక్రి య డిసెంబరులో మొదలవుతుంది. కోర్సు పూర్తి చేసుకున్నవారు సగటున రూ.22 లక్షల వార్షిక వేతనాన్ని పొందుతున్నారు.

రూ.44 లక్షలకుపైగా వేతనంతో అవకాశాలు అందుకున్న వారూ ఉన్నారు. ఇంటర్న్‌ వ్యవధిలో నెలకు రూ.1.10లక్షల నుంచి రూ.1.40లక్షల స్టైపెండ్‌ లభిస్తుంది. ఐఐఎం బెంగళూరులో ఎంబిఎ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సు అందుబాటులో ఉంది.

ఐఎస్‌బి బిజినెస్‌ ఎనలిటిక్స్‌లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం అందిస్తోంది. మణిపాల్‌ యూనివర్సిటీ ఎమ్మెస్సీ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సు ఆఫర్‌చేస్తోంది. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంబిఎ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సు అందుబాటులో ఉంది.

ఆన్‌లైన్‌లో:

ఎంఐటి, స్టాన్‌ఫర్డ్‌, జాన్‌ హాప్కిన్స్‌ తదితర విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌కోర్సులు అందిస్తున్నాయి.కోర్స్‌ఎరా, ఎడ్‌ఎక్స్‌, యుడెమి, గ్రేట్‌ లర్నింగ్‌ సంస్థలూ వివిధ కోర్సులను నిర్వహిస్తున్నాయి. గ్రేట్‌లేక్స్‌, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ సంస్థలు పని అనుభవం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా కోర్సులు ఆఫర్‌ చేస్తున్నాయి.

నియామక సంస్థలు:

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మెకిన్సే అండ్‌ కంపెనీ, ఐటిసి, పిడబ్ల్యూసి, యర్నెస్ట్‌ అండ్‌యంగ్‌, గార్ట్‌నర్‌, జియో, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌ బ్యాంకు, పేపాల్‌, మాస్టర్‌ కార్డు, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, మిత్సుబిషి, వాల్‌ మార్ట్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, టిసిఎస్‌, యాక్సెంచర్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సిఎల్‌ వంటి కంపెనీలు ఎన్నో క్యాంపస్‌ నియామకాల ద్వారా ఎనలిస్టు లకు అవకాశాలుకల్పిస్తున్నాయి. ప్రారంభంలో ఎనలిస్టుగావిధులు నిర్వహిం చి, నాలుగేళ్ల అనుభవంతో సీనియర్‌ ఎనలిస్టు హోదాకు చేరుకోవచ్చు.

ఎన్నో రకాల జాబ్‌లు..

  • డేటా ఎనలిస్ట్‌: భిన్న మార్గాల్లో డేటా సేకరిస్తా రు. విశ్లేషిస్తారు. సమస్యలను గుర్తిస్తారు. పరిష్కారం చూపుతారు.
  • బిజినెస్‌ ఎనలిస్ట్‌: డేటా ఎనలిస్ట్‌ నుంచి సమాచారాన్ని స్వీక రించి, దానికి అనుగుణంగా వ్యాపార నిర్ణయాలు తీసుకుం టారు. మార్పులు చేపడతారు.
  • డేటా సైంటిస్ట్‌: డేటా ఉప యోగించి, భవిష్యత్తును అంచనా వేస్తారు. పరిస్థితులు ముందు ముందు ఎలా ఉండబోతున్నాయి, అందుకు అనుగుణంగా ఏమి చేయాలో సూచిస్తారు. భవిష్యత్తు అవసరాల మేరకు కంపెనీలను సిద్ధం చేస్తారు.
  • విజువలైజేషన్‌ కన్సల్టెంట్లు: టబ్లూ లాంటి టూల్స్‌ ఉపయో గించి భారీగా ఉన్న వినియోగదారుల సమాచారం ఆధారంగా కొనుగోళ్లను పరిశీలిస్తారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/