హెచ్‌1 వీసా రద్దయితే… ప్రత్యామ్నాయ మార్గాలు

విదేశీ ఉద్యోగాలు- తీరుతెన్ను

H!B-VISA
H!B-VISA

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మురళీధర్‌ (పేరు మార్చటం జరిగింది) ఎంఎస్‌పూర్తి చేసి..యూఎస్‌లోని బే ఏరియాలో ఓ ప్రముఖ సంస్థలో హెచ్‌-1బి వీసాతో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య సుమలత (పేరు మార్చాం) కూడా ఉన్నత విద్యావంతురాలే.

వాస్తవానికి హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల కోసం 2015లో ఒబామా ప్రభుత్వం హెచ్‌-4 (ఎంప్లా§్‌ుమెంట్‌ అథరైజేషన్‌ డాక్యుమెంట్‌) తెచ్చింది. ఫలితంగా భారతీయులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ప్రయోజనం పొందారు.

ఇప్పుడు ఈ వీసా రద్దు కారణంగా స్వదేశానికి తిరిగొచ్చే యాల్సిందేనా? హెచ్‌-4 వీసా రద్దుతో భారతీయులపై పడే ప్రభావం-ప్రత్యామ్నాయ మార్గాల గురించి తెలుసుకుందాం.

ఇప్పుడు హెచ్‌-4 వీసా రద్దు ప్రక్రియ దాదాపు చివరిదశకు చేరుకున్న నేపధ్యంలో ఆ కుటుంబంలో ఆందోళన నెలకొంది. రకరకాల ప్రత్యామ్నాయాల దిశగా ఆమె ఆలోచిస్తున్నారు.

Cancel H1 Visa-Alternative Ways

భారత్‌కు తిరిగొచ్చేందుకు సైతం సిద్దపడ్డారు. భరత్‌ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తూ ఆ సంస్థకు కాలిఫోర్నియాలో ఉన్న కార్యాలయంలో రెండేళ్ల క్రితం పని చేసేందుకు వెళ్లారు. సంస్థ హెచ్‌-4 ఆధారంగా ఆమె అక్కడే ఓ సాప్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.

ఇప్పుడు హెచ్‌-4 రద్దు దిశగా అడుగులు పడుతున్న పరిస్థితి. దాంతో ఆమె విదేశానికి తిరిగొచ్చి తన అర్హత (ఎమ్మెస్సీ-కంప్యూటర్‌) ఆధారంగా ఇక్కడే ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నారు. హెచ్‌-4 వీసాల రద్దు ప్రక్రియ చివరి దశలో ఉన్నట్లు అమెరికా ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో భారతీయుల్లో ఆందోళన మొదలైంది.

అయితే ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి చవిచూడడం, జోబిడెన్‌ గెలుపొందడంతో భారతీయులు, విదేశీలకు కొంత ఊరట లభించింది. హెచ్‌-4వీసా రద్దు అయిన వారికి పలు ప్రత్యామ్నా యాలను నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటి విషయంలో చాలా పరిమితులు, నిబందనలు ఉండటం ప్రధాన సమస్యగా మారింది.

హెచ్‌-4 రద్దు ప్రభావానికి గురయ్యే వారికి అందుబాటులో ఉన్న ప్రధాన ప్రత్యామ్నాయం..
హెచ్‌-4 గడువు ముగిసేలోగా తమకున్న అర్హతలతో కొత్త కంపెనీలో హెచ్‌-1 కేటగిరీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం.

మార్గంలోఉద్యోగం దక్కించుకుని సదరు ఎంప్లాయర్‌ ద్వారా హెచ్‌-1బి కోసం దరఖాస్తు చేయించుకోగలిగితే అమెరికాలోనే ఉద్యోగం చేస్తూ కొనసాగొచ్చు. కాని అది అంత తేలిక కాదని నిపుణులు పేర్కొంటున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/