విజయవంతంగా ముగిసిన ‘కార్టింగ్ సూపర్‌సిరీస్’

RPPL’s ‘Karting SuperSeries’ unearths India’s next racing star after thrilling finale in Hyderabad

హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్) ప్రారంభ సీజన్‌లో విజయానికి మార్గదర్శకత్వం వహించిన విజనరీ గ్రూప్ రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌పిపిఎల్), ప్రఖ్యాత చికేన్ సర్క్యూట్‌లో ‘కార్టింగ్ సూపర్‌సిరీస్’ విజయవంతంగా ముగిసినట్లు నేడు సగర్వంగా ప్రకటించింది. చెన్నై, బెంగళూరు, కేరళ, ముంబయి మరియు ఢిల్లీలో జరిగిన ఈ ఉల్లాసకరమైన పోటీ హైదరాబాద్‌లో అత్యంత ఉత్కంట భరితం గా జరిగిన ఫైనల్ తో ముగిసింది. రచిత్ సింఘాల్ ఈ ఫైనల్ లో విజయం సాధించారు. భారతదేశంలో తదుపరి రేసింగ్ ప్రతిభను గుర్తించడం మరియు పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ ఫోర్-స్ట్రోక్ సూపర్‌సిరీస్ లో పాల్గొన్న డ్రైవర్‌లు (14 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు ) అద్భుతమైన నైపుణ్యాలను మరియు సంకల్పాన్ని ప్రదర్శించారు. ప్రేక్షకులను అమితం గా వారు తమ ప్రతిభ తో ఆకర్షించటం తో పాటుగా మోటార్‌స్పోర్ట్‌పై తమ అభిరుచిని వెల్లడించారు. చెన్నైలోని ECR స్పీడ్‌వే, బెంగళూరులోని మెకో కార్టోపియా, కేరళలోని స్పీడ్‌వే త్రిసూర్, ముంబైలోని అజ్మీరా ఇండికార్టింగ్ మరియు ఢిల్లీలోని గురుగ్రామ్‌లోని కార్టోమేనియా (F11 కార్టింగ్)తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత కార్టింగ్ ట్రాక్‌లలో పోటీలోని ప్రతి లెగ్ ప్రత్యేకమైన మరియు సవాలుతో కూడిన అనుభవాన్ని అందించింది.

ప్రతి లెగ్‌లోని టాప్ ఆరుగురు ఫైనలిస్టులు హైదరాబాద్‌లోని చికేన్ సర్క్యూట్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో తమ సత్తాను నిరూపించుకునే అవకాశాన్ని పొందారు. ఉత్సాహం తారాస్థాయికి చేరుకున్న వేళ రచిత్ సింఘాల్ పోటీ అంతటా అసాధారణమైన ప్రతిభ, ఖచ్చితత్వం మరియు వ్యూహాత్మక ప్రతిభను కనబరుస్తూ ‘కార్టింగ్ సూపర్‌సిరీస్’ ముగింపులో ఛాంపియన్‌గా అవతరించారు. పోటీ విజయవంతం కావడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసిన , రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అఖిల్ రెడ్డి మాట్లాడుతూ, “యువ రేసింగ్ ప్రతిభను ప్రదర్శించేందుకు కీలకమైన వేదికగా ‘కార్టింగ్ సూపర్ సిరీస్’ ను నిలపటంతో పాటుగా వారి నైపుణ్యాలు మరియు మోటార్‌స్పోర్ట్స్‌లో వారి కెరీర్‌ని ప్రారంభించటానికి అత్యంత కీలకమైన వేదికగా ప్రాముఖ్యత పొందటం పట్ల గర్విస్తున్నాము. RPPL భారతదేశంలోని రేసింగ్ స్టార్‌ల యొక్క తరువాతి తరం యొక్క అభివృద్ధి కి కట్టుబడి ఉంది మరియు రచిత్ సింఘాల్ విజయం మన దేశంలో ఉన్న సామర్ధ్యం మరియు ప్రతిభకు నిదర్శనం. ఈ పోటీ యొక్క అద్భుతమైన విజయానికి సహకరించిన భాగస్వాములు, ప్రేక్షకులు, స్పాన్సర్‌లు మరియు భాగస్వాములందరికీ RPPL వద్ద మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము ఈ వర్ధమాన డ్రైవర్‌లకు అవకాశాలు, మద్దతును అందించడం కొనసాగించటంతో పాటుగా భారతీయ రేసింగ్ వృద్ధికి దోహదపడతాము” అని అన్నారు.

RPPL సహ వ్యవస్థాపకుడు శ్రీ అర్మాన్ ఇబ్రహీం తన ఉత్సాహాన్ని పంచుకుంటూ “‘కార్టింగ్ సూపర్‌సిరీస్’ ఒక అద్భుతమైన ప్రయాణం, యువ డ్రైవర్‌లు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మరియు మోటార్‌స్పోర్ట్స్ ప్రపంచంలో తమదైన ముద్ర వేయడానికి ఒక అమూల్యమైన అవకాశాన్ని అందిస్తోంది. RPPL వద్ద, మేము రేసింగ్ ప్రతిభను వృద్ధి చేయటం మరియు వారు ఎదగడానికి ఒక వేదికను అందించడం పట్ల ఆసక్తి చూపుతున్నాము. భారతదేశంలో మోటార్‌స్పోర్ట్స్ అభివృద్ధి ని ప్రోత్సహించడానికి కంపెనీ పూర్తి అంకితభావంతో ఉంది. యువ ప్రతిభావంతులు వారి కలలను కొనసాగించడానికి మరియు ప్రపంచ రేసింగ్ వేదికపై తమ సత్తా చాటటానికి తగిన రీతిలో వారిని తీర్చిదిద్దనుంది . ఈ పోటీ, ఈ యువ డ్రైవర్ల అసాధారణ సామర్థ్యాలను ప్రధానంగా వెల్లడి చేయడమే కాకుండా భారతదేశంలో మోటార్‌స్పోర్ట్స్ అభివృద్ధి మరియు పురోగతికి మా నిబద్ధతను కూడా ప్రదర్శిస్తుంది. మేము వారి ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాము మరియు వారి భవిష్యత్ విజయాలను చూడటానికి ఆసక్తి గా ఎదురుచూస్తున్నాము.” ఈ ఈవెంట్ యొక్క ఆర్గనైజర్ అయిన RPPL, విజయవంతమైన IRL ప్రారంభ సీజన్‌లో నిర్వహణకు కూడా నాయకత్వం వహించింది. నగర ఆధారిత ఫ్రాంచైజీ రేసింగ్ లీగ్‌లో చెన్నై మరియు హైదరాబాద్‌లలో జరిగిన 4 లెగ్డ్ పోరులో 24 మంది ప్రముఖ విదేశీ మరియు భారతీయ డ్రైవర్లతో పాటు ఆరు జట్లు అత్యున్నత స్థానాల కోసం పోటీ పడ్డాయి. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్‌కు చెందిన అఖిల్ రవీంద్ర డ్రైవర్స్ టైటిల్‌ను గెలుచుకోగా, గాడ్‌స్పీడ్ కొచ్చి జట్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీని గెలుచుకుంది.

RPPL గురించి:
రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RPPL) భారతదేశంలో 4W మోటార్‌స్పోర్ట్స్ యొక్క ప్రత్యేక హక్కులను కలిగి ఉంది మరియు IPలను అభివృద్ధి చేయడం మరియు మోటార్‌స్పోర్ట్స్‌లో ఛాంపియన్‌షిప్‌లను నిర్వహించడం వంటి వ్యాపారంలో నిమగ్నమై ఉంది. 2018లో అర్మాన్ ఇబ్రహీం, ఆదిత్య పటేల్ మరియు అభినందన్‌లచే స్థాపించబడిన, రేసింగ్ ప్రమోషన్ లో మౌలిక సదుపాయాలు, ఇంధనం మరియు రక్షణ తదితర రంగాలలో వ్యాపారాలు చేస్తున్న మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL)కి చెందిన అఖిలేష్ రెడ్డికి మెజారిటీ వాటాలు ఉన్నాయి.