పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా

సోమవారం మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన నగరి ఎమ్మెల్యే రోజా..బుధువారం పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే రెవెన్యూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.కార్మిక మంత్రిగా గుమ్మనూరు జయరాం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. బీసీలంతా ఎప్పటికీ సీఎం జగన్‌కి అండగా ఉంటారన్నారు.

ఇక ఆర్కే రోజా రాజకీయ విషయానికి వస్తే..1999లో టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004లో నగరి నియోజకవర్గం, 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచారు. 2019 నుంచి 2021 వరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఇప్పుడు పర్యాటక శాఖా మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించబోతున్నారు.

రాజకీయ నేపథ్యం: 1999లో టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004లో నగరి నియోజకవర్గం, 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచారు. 2019 నుంచి 2021 వరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా బా«ధ్యతలు నిర్వర్తించారు.