ఈ నెల 16న కర్నూలు పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్

కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు

అమరావతి : సీఎం జగన్ ఈ నెల 16న కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. 16న పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బావ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు. కృష్ణా నగర్ లోని ఎమ్మెల్యే శ్రీదేవి నివాసంలో నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ పి. కోటేశ్వరరావు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/