15నుంచి ఎపిలో షూటింగ్‌లకు అనుమతి

-సిఎం జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ

Fillm stars with AP CM Jagan
Fillm stars with AP CM Jagan

అమరావతి: ఎపిలో సినిమా షూటింగ్‌లకుఈనెల 15 తర్వాత నుంచి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ప్రముఖసినీనటుడు చిరంజీవి తెలిపారు..

మంగళవారం ఆయనతోపాటు సినీ ప్రముఖులు దగ్గుబాటి సురేష్‌బాబు, నటుడు నాగార్జున,నిర్మాత సి.కల్యాణ్‌, రాజమౌళి తదితరులు సిఎం జగన్మోహనరెడ్డితో సిఎం క్యాంపు కార్యాలయంలో చర్చలు జరిపారు.

అనంతరం మీడియాతో చిరంజీవి మాట్లాడారు.. లాక్‌డౌన్‌ సమయంలో షూటింగ్‌లు స్తంభించిపో యాయని, దీంతో షూటింట్‌లు చేసుకునేందుకు అనుమతి ఇస్తామని సిఎం జగన్‌ చెప్పారని తెలిపారు.

త్వరలోనే విధి విధానాలను రూపొందిస్తామని సిఎం తెలిపారని పేర్కొన్నారు.

సినీ అభివృద్ధికి కృషిచేస్తామని సిఎం హామీ ఇచ్చినట్టు తెలిపారు.. అలాగే 2019-20 నంది అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/