చంద్రబాబు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని మంత్రి రోజా సవాల్..

టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు వైస్సార్సీపీ మంత్రి రోజా సవాల్ విసిరారు. కుప్పంలో చంద్రబాబు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ వార్ నడుస్తుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. తాజాగా కుప్పంలో చంద్రబాబు పర్యటించగా అక్కడ ఉద్రికత్త సంఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఫై నారా లోకేష్ చేసిన కామెంట్స్ కు రోజా స్పందించారు. అసలు లోకేష్ మాటలు వింటుంటే మాయాబజార్ లో ఉత్తర కుమారుడు గుర్తుకొస్తున్నాడని రోజా ఎద్దేవా చేసారు. లోకేష్.. జగన్ కాలి గోటికి కూడా సరిపోడని .. వార్డు మెంబర్ గా కూడా గెలవని వ్యక్తి సీఎం జగన్ ను విమర్శిస్తున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ ప్రచారం చేశాకే కుప్పం మునిసిపాలిటీ ఓడిపోయారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలు రాళ్ళు, కర్రలతో దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా సన్మానించమంటారా అంటూ టీడీపీ నేతలను ప్రశ్నించారు మంత్రి రోజా.

జగన్ ఫ్యాక్షనిస్ట్ కాదు, దమ్మున్న మగాడిలా సీఎం అయిన వ్యక్తి.. అసలు 33 ఏళ్లుగా మీరు చేయని అభివృద్ధి జగన్ చేసి చూపారంటూ ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించారు రోజా. కుప్పం నడిరోడ్డుపై చంద్రబాబు ను కూర్చోబెట్టాడు. అధికారంలో ఉన్న 14 ఏళ్లు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయకుండా చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు 33 ఏళ్లలో కుప్పంలో ఎన్నిసార్లు పర్యటించారో .. అంతకంటే ఎక్కువగా గత మూడేళ్లలో పర్యటించారని.. దీనికి కారణం కుప్పం ప్రజలు వైస్సార్సీపీ కి బ్రహ్మరథం పట్టడమే అన్నారు రోజా. అనుమానం ఉంటే రాజీనామా చేసి కుప్పంలో పోటీ చేయాలని మంత్రి ఆర్కే రోజా చంద్రబాబుకి సవాల్ విసిరారు.