ఫిలిప్పీన్స్లో తుఫాను బీభత్సం

కొనసాగుతున్న కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు

Philippine storm victims feared tsunami, ran towards mudslide

మనీలా: ఫిలిప్పీన్స్లో తుఫాను బీభత్సం సృష్టించింది. వారం రోజులకుపైగా కురుస్తున్న కుండపోత వాన జన జీవనాన్ని అస్థవ్యస్థం చేసింది. వరదల కారణంగా ఇప్పటి వరకు 100మందికిపైగా మృతి చెందారు. సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సముద్రంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. రాకాసి అలలను చూసి సునామీ భయంతో పరుగులు తీసిన ఓ గ్రామస్తులు బురదలో చిక్కుకుని సజీవ సమాధి అయ్యారు. భారీ వర్షాలకు తోడు ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడుతుండటంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తుఫాను కారణంగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకునేందుకు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ దళాలు రంగంలోకి దిగాయి.

తుఫాను ప్రభావం ఫిలిప్పీన్స్ లోని 8 రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లోని వీధుల్లో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నీళ్ల మధ్యలో చిక్కుకున్న వారిని ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ సిబ్బంది తాళ్ల సహాయంతో బయటకు తీసుకొస్తున్నారు. బాధితులను పడవల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారం రోజులుగా కుండపోత వానలు, వరదలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ప్రజలను రాకాసి అలలు ఓ గ్రామస్తులను మోసం చేసి బలి తీసుకున్నాయి. పెద్ద ఎత్తున వస్తున్న రాకాసి అలలను సునామీగా భావించిన కుసియోంగ్ గ్రామస్తులు ఓ పర్వతం వైపునున్న చర్చ దగ్గరకు పరుగులు తీశారు. వీరిలో చాలా మంది బురదలో చిక్కుకున్నారు. బురదలో కూరుకుపోయిన ఘటలో ఇప్పటి వరకు 20 మంది చనిపోయారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/