రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేసిన రోజా

అధ్వానంగా ఉన్న నగరి-పుత్తూరు జాతీయ రహదారిలో టోల్ చార్జీ వసూలు చేయొద్దు: ఎమ్మెల్యే రోజా

చిత్తూరు : చిత్తూరు జిల్లాలోని నగరి-పుత్తూరు జాతీయ రహదారి పరిస్థితి దారుణంగా ఉందని వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఇవాళ ఆమె విజయవాడలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబును కలిశారు. నగరి-పుత్తూరు జాతీయ రహదారి అధ్వానంగా ఉందని, అటువంటి రోడ్డులో టోల్ చార్జీలు వసూలు చేయడం సరికాదని అన్నారు.

ఈ మేరకు కృష్ణబాబుకు వినతిపత్రం అందజేశారు. తన నగరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి-చెన్నై జాతీయ రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నదని రోజా వివరించారు. వెంటనే ఆ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/