నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ 2వ క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM Shri Narendra Modi inaugurates 2nd campus of Chittaranjan National Cancer Institute in Kolkata

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చిత్తరంజన్ నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ (సీఎన్‌సీఐ) రెండో క్యాంపస్‌ను శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన మోడీకి మమత ధన్యవాదాలు తెలిపారు. మమత మాట్లాడుతూ.. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని, తన కాలేజీ రోజులు ఈ ప్రాంతంలోనే గడిచాయని చెప్పారు.

ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మోడీ ఇటీవల ఇచ్చిన ట్వీట్‌లో, సీఎన్‌సీఐ వల్ల తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఆరోగ్య సేవలు మరింత పెరుగుతాయని తెలిపారు. ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, సీఎన్‌సీఐ రెండో క్యాంపస్‌ను మోడీ దార్శనికతకు అనుగుణంగా నిర్మించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడం, విస్తరించడం మోడీ కల అని తెలిపింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/