పవన్ కళ్యాణ్ ను సన్నీ లియోన్ తో పోల్చిన మంత్రి రోజా

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తో పోల్చారు మంత్రి రోజా. పవన్ కళ్యాణ్ సంస్కారం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని , పవన్ సంస్కారం గురించి మాట్లాడుతుంటే సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్టుందని రోజా ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ ఎవరి మాటా వినడని, అందుకే భార్యలు కూడా వదిలేశారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాబు సమయంలో జన్మభూమి కమిటీల పేరుతో మోసం జరిగితే పవన్ నోరెందుకు లేవలేదు అని ప్రశ్నించారు. పవన్‌కు చట్టాల గురించి తెలియదు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే పవన్ కు తెలుసు. ఎవరూ బాగుండకూడదు… అందరూ కష్టాల్లో ఉండాలని పవన్ అనుకుంటున్నాడా?, ఎంతసేపూ మా అమ్మను అన్నారు…నా పెళ్లాన్ని అన్నారు…నా పిల్లలను తిట్టారని ఏడుపే కనబడుతోందంటూ రోజా విమర్శించారు.

గత నాల్గు రోజులుగా వాలంటీర్ల వ్యవస్థ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ నేతలు , వాలంటీర్లు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ తరుణంలో మంత్రి రోజా పైవిధంగా స్పందించారు.