చంద్రబాబుకు అతీంద్రయ శక్తులున్నాయి

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్

V. Vijayasai Reddy
V. Vijayasai Reddy

అమరావతి: ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ వణికిస్తుంది. అయితే ఈతరుణంలో వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రం సంధించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో…. తుపానులను నియంత్రించగల అతీంద్రయ శక్తులున్న చంద్రబాబునాయుడి వైపు ప్రపంచమంతా చూస్తోందని ట్వీట్ చేశారు. కరోనా వైరస్ బారినుంచి కాపాడేందుకు ఆయన ఏదో ఒకటి చేయకపోతే ఈ భూమ్మీద మనుషులెవరూ మిగలరని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అందరూ ఆందోళన చెందుతున్నారని సెటైర్ వేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/