విరాళాలు ప్రకటించిన రోహిత్ శర్మ
కరోనా పై పోరుకు మన నేతలకు మద్దతు తెలపాలని సూచన

ముంబయి: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా భారత క్రికెటర్ రోహిత్ శర్మ కూడా తనవంతు సాయం ప్రకటిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మనదేశం తిరిగి నిలబడాల్సిన అవసరం మనకు ఉంది, మనపై భాద్యత ఉంది. నేను నా వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నాను. పీఎం కేర్స్ ఫండ్‌కు 45 లక్షలు, మహారాష్ట్ర సిఎం రిలీఫ్ ఫండ్‌కు 25 లక్షలు, ఫీడింగ్ ఇండియాకు 5లక్షలు, వీధి శునకాల సంక్షేమ నిధికి 5 లక్షల రూపాయలను ఇస్తున్నాను. కరోనా పై పోరాటం చేస్తున్న ప్రధాని మోదికి, మన నేతలకు మద్దతు తెలుపుదాం. అని ట్వీట్ చేశాడు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/