భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు
ఇప్పటివరకు 1,353 పాజిటివ్ కేసులు, 32 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 1,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. అయితే ఈ వైరస్ కారణంగా 32మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన మత ప్రార్ధనలలో పాల్గోన్న వారిలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంకా మరికొంత మందికి పరీక్షలు జరుగుతున్నందున దేశంలో మరిన్ని పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/