ఘోర రోడ్డుప్ర‌మాదం..ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

న్యూఢిల్లీ : హ‌ర్యానాలో ఈరోజు ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. జాజ‌ర్ జిల్లాలో వేగంగా వ‌చ్చిన ట్ర‌క్కు, కారుపైకి దూసుకెళ్లింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వార‌ని పోలీసులు తెలిపారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/