అత‌ని మాట వింటే 5 ల‌క్ష‌ల మంది మరణించేవారు

ఫౌచీపై మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్‌

trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ఆ దేశానికి చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీపై మరోసారి మండిపడ్డాడు. క‌రోనా వైర‌స్ విష‌యంలో ఒక‌వేళ ఫౌచీ చెప్పిన‌ట్లు వింటే, దేశంలో వైర‌స్ మృతుల సంఖ్య 5 ల‌క్ష‌లు దాటేద‌ని ట్రంప్ ఆరోపించారు. ఫౌచీ ఓ డిజాస్ట‌ర్ అంటూ ఆయ‌న కామెంట్ చేశారు. ప్ర‌స్తుతానికి జాతీయ ఓపీనియ‌న్ పోల్స్‌లో ట్రంప్ వెనుకంజ‌లోనే ఉన్నా.. అంటువ్యాధుల నిపుణుడు ఫౌచీని మాత్రం ట్రంప్ మ‌ళ్లీ తిట్టిపోశారు. క‌రోనా వల్ల అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ల‌క్ష‌ల 20వేల మంది మ‌ర‌ణించారు. మ‌హ‌మ్మారి వ‌ల్ల అమ‌లు చేస్తున్న నిబంధ‌న‌ల‌తో అమెరిక‌న్లు విసిగిపోయిన‌ట్లు ట్రంప్ తెలిపారు. మ‌మ్ముల్ని వ‌దిలేయండి అంటూ ప్ర‌జ‌లు వేడుకుంటున్నారన్నారు. ప్రస్తుతం మహమ్మారి అదుపులోనే ఉంది. జనాలు కూడా మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టండి అంటున్నారు. ఫౌసీ లాంటి మూర్ఖుల మాటలు విని విని వారు అలసి పోయారు. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/