నేపాల్‌లో భారీ వర్షాలు.. 88 మంది మృతి

ఖాట్మాండు : నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడ్డ సంఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 88కి చేరింది. పలు ప్రాంతాల్లో మరో 11 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించిన వివరాల ప్రకారం.. ఆయా సంఘటనల్లో ఇప్పటి వరకు 30 మంది గల్లంతయ్యారు. తూర్పు నేపాల్‌లోని పంచతార్‌లో అత్యధికంగా 27 మరణాలు నమోదయ్యాయి.

ఇలం, దోతి జిల్లాల్లో 13 మంది మృత్యువాతపడ్డారు. కలికోట్, బైతాడి, దడెల్ధురా, బజాంగ్, హుమ్లా, సోలుఖుంబు, ప్యూథాన్, ధన్‌కుట, మొరాంగ్, సున్సారీ, ఉదయపూర్‌తో సహా 15 ఇతర జిల్లాలో జనం వర్షాలతో మృతి చెందారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/