చౌటుప్పల్ సమీపంలోని ఘోర రోడ్డుప్రమాదం..

చౌటుప్పల్ సమీపంలోని ఘోర రోడ్డుప్రమాదం..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాకినాడ నుండి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ బస్సును లక్కారం సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే..

కాకినాడ నుండి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ లక్కారం వద్ద రాగానే టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చౌటుప్పల్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ట్రావెల్స్‌ బస్సు, టిప్పర్‌ డ్రైవర్‌ల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. లారీ, బస్సు డ్రైవర్లు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో బయటకు తీసేందుకు చాలా శ్రమపడాల్సి వచ్చింది. ఈ ప్రమాదంతో విజయవాడ-హైదరాబాద్‌ రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలచిపోయింది. దీంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్నారు.