పాపమని లోకేష్ సాయం చేస్తే..ఆ డబ్బునంతా దొంగలు ఎత్తుకెళ్లారు

ఈ మధ్య సోషల్ మీడియా లో ఓ బాలుడు చిన్న వయసులోనే ఆటో నడుపుతూ కుటుంబ భారం మోస్తున్న వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు అంధులు కావడం తో ఆటో నడుపుతూ కుటుంబ భారాన్ని మోస్తూ తల్లి దండ్రులను . సోదరులను ఆసరాగా ఉంటున్నాడు. ఈ వార్త అందర్నీ కలచివేసింది. ఈ వార్త చూసిన టీడీపీ నేత నారా లోకేష్ బాలుడి వివరాలు అడిగి తెలుసుకొని రూ. 80 వేలు ఆర్ధిక సాయం అందించారు.

లోకేష్ సాయం తో ఆ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేకపోయింది. ఆ కుటుంబం బలహీనతను ఆసరాగా చేసుకొని ఆ ఇంట్లో దొంగలు పడి ఆ డబ్బంతా ఎత్తుకెళ్లారు. సూట్ కేసులో భద్రపరిచిన డబ్బు ను ఎత్తుకెళ్లారు. ఐతే, దుండగుడి సెల్ ఫోన్ అక్కడే కింద పడిపోయింది. తెల్లవారుజామున ఆ బాలుడు తన ఇంట్లో తిరుగుతుండగా అది కాలికి తగిలింది. అనుమానంతో సూట్ కేసును తెరిచి చూడగా డబ్బుల్లేవు. దీంతో ఏడ్చుకుంటూ స్థానికుల సాయం తో చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు.