కాంతార డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..?

కెజిఎఫ్ తర్వాత తెలుగు అంత స్థాయిలో విజయం సాధించిన కన్నడ మూవీ కాంతార. ఎలాంటి హైప్ లేకుండా థియేటర్స్ కు వచ్చి కేవలం మౌత్ టాక్ తో భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో నటి నటులు కానీ , డైరెక్టర్ కానీ ఇలా ఎవ్వరు పెద్ద గా తెలియదు. అయినప్పటికీ కథ తో సినిమా విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ , నటుడు రిషబ్ శెట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈయన తెలుగు లో సినిమాలు చేయాలనీ చూస్తున్నాడు. ఈ క్రమంలో ఈయనతో విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

రిషబ్ శెట్టికి దర్శకుడిగా మంచి అనుభవం ఉంది. ఆయన దర్శకత్వంలో తెలుగులో ఒక సినిమా చేయాలనుందని ఆ మధ్య మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అన్నారు. త్వరలోనే ఆ మాటను నిజం చేయాలనే ఆలోచనలో రిషబ్ శెట్టి ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా చేయాలనే దిశగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడని అంటున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ .. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషీ’ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత గౌతమ్ తిన్ననూరి .. పరశురామ్ లతో కలిసి పనిచేయనున్నాడు. మరి ఈ గ్యాప్ లో రిషబ్ శెట్టి తో సినిమా చేస్తారా..? లేక ఆ రెండు సినిమాలు పూర్తి అయ్యాక చేస్తారా అనేది చూడాలి.