మచిలీపట్నం కు బయలుదేరిన పవన్

జనసేన ఆవిర్భావ సభ మరికాసేపట్లో మొదలుకాబోతుంది. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ నోవాటెల్ నుండి ఆటోనగర్ కు వచ్చారు. ఆటో నగర్ నుండి వారాహి వాహనం ద్వారా మచిలీపట్నం సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇప్పటికే లక్షాలమంది జనసేన కార్య కర్తలు , వీరాభిమానులు , అభిమానులు చేరుకున్నారు. మరోపక్క ఆటో నగర్ వద్ద వేలాదిమంది అభిమానులు చేరుకున్నారు. ఎటు చూసిన జనసేన కార్యకర్తలే కనిపిస్తున్నారు.

2013 మార్చి 14న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. అయితే రాష్ట్రం విడిపోయాక 2014లో జరిగిన ఎన్నికల్లో పవన్ పోటీకి దిగలేదు. టీడీపీ-బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చారు. దీంతో 2014లో ఆ రెండు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయి. కొన్నాళ్లు రెండు పార్టీలకు మద్ధతు ఇచ్చారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి రాష్ట్రానికి హోదా ఇవ్వడం లేదు..న్యాయం చేయట్లేదు..దీంతో బి‌జే‌పిని విభేదించారు.

ఆ తర్వాత టి‌డి‌పితో విభేదించారు..రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు. ఇక 2019 ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగారు..బి‌ఎస్‌పి, సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలతో కలిసి పోటీ చేశారు. కేవలం ఒక సీటు గెలిచారు. పవన్ రెండుచోట్ల ఓడిపోయారు. అయినా సరే పవన్ ప్రజల పక్షాన పోరాడుతూనే వస్తున్నారు. మరి ఈసారి ఎన్నికల్లో సింగిల్ గా బరిలోకి దిగుతారా..? లేక టిడిపి తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతారా..? ఈరోజు పార్టీ ఆవిర్భావ సభలో పొత్తు ఫై ఏమైనా మాట్లాడతారా అనేది చూడాలి.