కాంతార 1 రాబోతుందని గుడ్ న్యూస్ తెలిపిన రిషబ్ శెట్టి

కాంతార ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎలాంటి అంచనాలు లేకుండా కనీసం ఇందులో నటించిన వారు కూడా తెలియకుండా విడుదలై దాదాపు రూ.400 కోట్లు రాబట్టి అద్భుతం సృష్టించింది. ఈ సినిమా గురించి ఇంకా సినీ ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ సినిమా కు సీక్వెల్ వస్తే బాగుంటుందని అంత అనుకుంటున్నా సమయంలో హీరో రిషబ్ శెట్టి ఈ సినిమా గురించి ఆసక్తిక విషయాన్నీ తెలియజేసి అభిమానుల్లో సంతోషం నింపారు. కాంతార మళ్లీ రాబోతుంది అంటూ స్పష్టం చేశాడు.

అయితే మీరు గత ఏడాది చూసింది కాంతార 2 సినిమా కాగా.. ప్రస్తుతం కాంతార 1 కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆయన మాటలను బట్టి కాంతార సినిమాకు సీక్వెల్ కాకుండా ప్రీ క్వెల్ రూపొందుతున్నట్లుగా అనిపిస్తుంది. కాంతార సినిమా కు ముందు జరిగే కథ ను కొత్త కాంతారలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.గత ఏడాది వచ్చిన కాంతార చిన్న బడ్జెట్ సినిమా కాగా.. ప్రస్తుతం చేయబోతున్న కాంతార సినిమా భారీ బడ్జెట్ మూవీ అంటూ కన్నడ సినీ వర్గాలు అంటున్నారు.