క్యూ3లో అదరగొట్టిన రిలయన్స్‌

reliance industries
reliance industries

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రికార్డు స్థాయిలో రూ.11,640 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ3లో రూ. 10,251 కోట్ల నికర లాభం వచ్చిందని, 14% వృద్ధి సాధించామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. భారత్‌లో ఒక ప్రైవేటు కంపెనీకి ఒక త్రైమాసిక కాలంలో ఇదే అత్యధిక నికర లాభం కావడం గమనార్హం. చమురు శుద్ధి వ్యాపారం లాభాలు బాట పట్టడం, కన్సూమర్‌ వ్యాపారాలైన రిలయన్స్‌ రిటైల్‌, జియోల జోరు కొనసాగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది. ఇక ఆదాయం మాత్రం 1.4% క్షీణించి రూ. 1,68,858 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. కాగా క్యూ2(సెప్టెంబర్‌ క్వార్టర్‌) లోనూ రిలయన్స్‌ రికార్డు స్థాయిలోనే లాభాలను ఆర్జించింది. కంపెనీ కన్సూమర్‌ వ్యాపార విభాగాలైన రిలయన్స్‌ రిటైల్‌, రిలయన్స్‌ జియోల జోరు కొనసాగుతోంది. ఈ రెండు వ్యాపారాల స్థూల లాభం రికార్డు స్థాయిలో పెరిగింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/