హద్దు మీరి ప్రవర్తించిన కగిసో రబాడ

Kagiso Rabada fined for ICC code breach
Kagiso Rabada fined for ICC code breach

హైదరాబాద్‌: దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు దూరం కానున్నాడు. ప్రస్తుతం పోర్టు ఎలిజబెత్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ వికెట్‌ తీసిన ఆనందంలో సఫారీ కగిసో రబాడ మైదానంలో హద్దు మీరి ప్రవర్తించాడు. దీంతో అతడు లెవెల్‌-1 తప్పిదానికి పాల్పడినట్లు ఐసీసీ రబాడకు మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు అతడి ఖాతాలో ఒక డీమెరిట్‌ పాయింట్‌ జత చేర్చింది. ఇప్పటికే రబాడ ఖాతాలో మూడు డీమెరిట్‌ పాయింట్లు ఉండటంతో తాజా డీమెరిట్‌ పాయింట్‌తో కలిపి నాలుగుకు చేరింది. ఫలితంగా జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జనవరి 24 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా జరిగిందంటే మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ వికెట్‌ తీసిన ఆనందంలో కగిసో రబాడ క్రీజులో ఉన్న జో రూట్‌ ఎదురుగా వెళ్లి నేలపై గుద్దుతూ పెద్దగా అరుస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. రబాడ ప్రవర్తన ఐసీసీ నియమావళి యొక్క ఆర్టికల్‌ 2.5ను ఉల్లంఘించినట్లు తేల్చింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/